Share News

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి: సాధినేని యామిని

ABN , Publish Date - May 12 , 2024 | 06:00 PM

రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.

AP Election 2024:ఆ ప్రాంతాలు సమస్యాత్మకం.. బలగాలు పెంచాలి:  సాధినేని యామిని
Sadineni Yamini

అమరావతి: రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.రామలసీమలోని ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయని తెలిపారు.


వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారని.. దీంతో ధర్మవరం కూటమి అభ్యర్ధి సత్యకుమార్ మరిన్ని కేంద్ర బలగాలను డిప్లాయ్ చేయాలని హై కోర్టుకు వెళ్లారని వివరించారు. కోర్టు తీర్పు సారాంశాన్ని సీఈఓ ఎంకే మీనాకు అందించామని అన్నారు. సీఈఓ మీనాను కలిసి రాయలసీమలో ఇబ్బంది ఉంది గనుక పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. ఏపీ డీజీపీకి కూడా ఈ విషయంపై రిప్రజెంట్ చేయాలని నిర్ణయిచామన్నారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అక్కడ బెదిరింపులకు దిగుతారని హెచ్చరించారు.


ఆ ఆర్డర్ కాపీలు సీఈఓ మీనాకు ఇచ్చాం: కిలారి దిలీప్

అత్యంత సమస్యాత్మక బూత్‌లను గుర్తించి న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లామని బీజేపీ నేత కిలారి దిలీప్ (Kilari Dileep) తెలిపారు. ఇదే అశంపై సీఈవో ఎంకే మీనాను, డీజీపీలను కలిసి స్పెషల్ ఫోర్స్ కోసం అభ్యర్థిస్తున్నామన్నారు. సెన్సిటివ్ బూత్‌‌లలో సీసీ కెమెరాలు పెడతామని అన్నారు. న్యాయస్థానంలో వచ్చిన ఆర్డర్ కాపీలు సీఈఓ మీనాకు ఇచ్చామని అన్నారు.ఈ నియోజక వర్గాల్లో సెంట్రల్ ఫోర్సెస్ కోసం సీఈఓ మీనాను కోరామని కిలారి దిలీప్ పేర్కొన్నారు.

Updated Date - May 12 , 2024 | 06:05 PM