Share News

Venigandla Ramu: గుడివాడను నాని ఎంత అభివృద్ధి చేశారో చేప్పలేము కానీ....

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:21 PM

Andhrapradesh: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.

Venigandla Ramu: గుడివాడను నాని ఎంత అభివృద్ధి చేశారో చేప్పలేము కానీ....
Venigandla Ramu Challenge to Kodali Nani

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 18: ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి (Former Minister kodali Nani) గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu) సవాల్ విసిరారు. గురువారం రాము సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువాలు కప్పి యువతను వెనిగండ్ల రాము టీడీపీలోకి ఆహ్వానించారు.

AP Elections: వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..


ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఎన్ని నిధులు తెచ్చి గుడివాడ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పలేము కానీ - జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియా, రియల్ మాఫియాలలో గుడివాడలో ఎంతో అభివృద్ధి చేశారంటూ ఎద్దేవా చేశారు. బూతులు తిడుతూ నోరేసుకొని పడిపోవడం కాదని, ప్రచారంలో తమ సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజల నిలదీతలపై దమ్ముంటే మాట్లాడాలన్నారు. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా నీటి కష్టాలు, రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘గుడివాడ ప్రజలకు మాట ఇస్తున్నాను - ఎన్నికల అనంతరం కూడా మీతో కలిసే ప్రయాణిస్తాను’’ అని హామీ ఇచ్చారు.

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..


ప్రజలకు మంచి చేయడం కోసం మంచి వారందరూ టీడీపీలోకి వస్తున్నారన్నారు. ఎన్నికలలోపు వైసీపీ ఖాళీ అవుతుందని, ఎన్నికల తర్వాత కనిపించదంటూ వ్యాఖ్యలు చేశారు. నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అని.. అవసరం తీరిన తర్వాత వదిలేయడంలో నానిని మించిన వారు లేరన్నారు. 20 ఏళ్లుగా మోసపోయింది చాలని.. ఇక మోసపోలేమంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

TDP: వైసీపీకి షాక్.. టీడీపీలోకి రెండు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నేతలు..

Big Breaking: పిఠాపురం వైసీపీ అభ్యర్థికి అస్వస్థత.. మధ్యలోనే వెళ్లిపోయిన గీత!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 01:21 PM