AP News: కడప కోర్టు ఉత్తర్వులపై.. సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్
ABN , Publish Date - May 18 , 2024 | 07:07 PM
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కడప: సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వివేకా హత్యపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా వైఎస్సార్పీపీ అధ్యక్షుడు వేసిన పిటీషన్‌పై కడప కోర్టు ఏప్రిల్16వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. కడప కోర్టు ఉత్తర్వులపై షర్మిల హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆమె పిటీషన్‌ను కొట్టేసింది.
దీంతో షర్మిల సుప్రీంకోర్టుకు వెళ్లారు. షర్మిల పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.వాక్ స్వాతంత్య్రాన్ని, వ్యక్తి స్పేచ్ఛను హరించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడుతామని తెలిపింది.
ఇవి కూడా చదవండి
Big Breaking: ఏపీలోని మూడు జిల్లాలకు ఎస్పీల నియామకం
YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
Read more AP News and Telugu News