Andhra Pradesh: మరీ ఇంత దుర్మార్గమా? టీడీపీలో చేరారని ఏం చేశారంటే..
ABN , Publish Date - May 05 , 2024 | 06:07 PM
న్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఏపీలో(Andhra Pradesh) పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో ఆ పార్టీ వారు అక్కసుతో, ఆగ్రహంతో రెచ్చిపోయి దాడులకు తెగపడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఇంత దుర్మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు.
గుంటూరు, మే 05: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఏపీలో(Andhra Pradesh) పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో ఆ పార్టీ వారు అక్కసుతో, ఆగ్రహంతో రెచ్చిపోయి దాడులకు తెగపడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఇంత దుర్మార్గమా? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా గుంటూరు(Guntur) జిల్లా ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు పాత వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. అయితే, వాహనాలకు నిప్పు పెట్టింది వైసీపీ వాళ్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి నసీర్.. అగ్ని ప్రమాద ప్రాంతానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. వైసీపీ వాళ్లే నిప్పు పెట్టారని స్థానికులు ఆరోపించగా.. వారిక అండగా ఉంటామని టీడీపీ అభ్యర్థి భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఆటో వర్కర్స్.. ఇటీవలే టీడీపీలో చేరారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న దుండగులు.. అక్కసులో టీడీపీలో చేరిన వారి షాపుల్లోనే వాహనాలకు నిప్పటించారు. చుట్టూ అనేక షాపులు ఉన్నప్పటికీ.. కేవలం టీడీపీలో చేరిన వారి షాపుల్లోనే అగ్ని ప్రమాదం సంభవించాడాన్ని గమనించిన బాధితులు.. ఇది వైసీపీ నేతల పనే అని ఆరోపిస్తున్నారు. కాగా, వైసీపీ శ్రేణుల చర్యపై టీడీపీ అభ్యర్థి నసీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.