AP Elctions: మరికొంత మంది వైసీపీ నుంచి టీడీపీలోకి...
ABN , Publish Date - May 06 , 2024 | 03:47 PM
Andhrapradesh: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.
విజయవాడ, మే 6: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో (YSRCP) మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో (TDP) చేరారు. ఆపై కేశినేని శివనాథ్‌ను జగన్మోహన్ రావు కలువగా.. ఆయనకు చిన్ని పసుపుకండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
AP New DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ గుప్తా..
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు, నాగేంద్రలు టీడీపీలో చేరారన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని తెలిపారు. జగన్ నియంతృత్వ విధానాలతో అందరూ విసిగి పోయారని.. అందుకే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు టీడీపీ బాట పడుతున్నారన్నారు. ముందు ముందు చాలా మంది ముఖ్య నేతలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసి ఏపీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి విజయం ఎంతో అవసరమన్నారు. ఈ ఐదు రోజులూ అందరూ కలిసి మెలిసి పని చేయాలని కోరారు. తప్పకుండా దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఐదు రోజులు ప్రజల్లో ఉంటూ... మనం చేసే మంచిని వివరించాలని నేతలకు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.
AP Elections 2024: మరో సీనియర్ పోలీస్ అధికారిపై ఈసీ వేటు..
అదే జగన్ నైజం: జగన్మోహన్ రావు
కులాలు, మతాల ప్రాతిపదికన విడగొట్టడమే జగన్ నైజమని ఏలేశ్వరపు జగన్మోహన్ రావు మండిపడ్డారు. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎనిమిది వందల కోట్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. నిజంగా కేటాయిస్తే ఆ డబ్బు ఎక్కడకి వెళ్లిందో సజ్జల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని... అప్పుడే అందరకీ మేలు జరుగుతుందని తెలిపారు. బ్రాహ్మణ సంఘాలు మొత్తం కూటమికే మద్దతు ఇస్తున్నాయని జగన్మోహన్‌రావు పేర్కొన్నారు.