AP Elections 2024: మరో సీనియర్ పోలీస్ అధికారిపై ఈసీ వేటు..
ABN , Publish Date - May 06 , 2024 | 02:57 PM
పొలిటిల్ విశ్లేషకులు భావించినట్లుగానే జరిగింది. మొదట పోలీస్ బాస్‌పై(AP DGP) వేటు పడింది.. ఆ తరువాత జిల్లా స్థాయి అధికారులపై వేటు పడుతోంది. తాజాగా అనంతపురం(Anantapur) జిల్లా డీఐజీపై(DIG) బదిలీ వేటు పడగా.. ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది. నెక్ట్స్ చర్యలు ఎవరిపైనా? అని ప్రభుత్వ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.
అమరావతి, మే 06: ఏపీలో ఎన్నికలు(AP Assembly Elections) సమీపిస్తున్న వేళ.. పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్(Election Commission Of India) వేటు వేస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరో సీనియర్ పోలీసు అధికారిపై(AP Police Officer) కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై(Anantapur Range DIG Ammireddy) బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశించింది. కింది స్థాయి అధికారులకు బాధ్యలు అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులేవీ ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశించింది.
అమ్మిరెడ్డిపై బదిలీ వేటు అందుకే..
డీఐజీ అమ్మిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష కూటమి నేతలు కూడా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీతో అంటకాగుతున్నారని, ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఈసీకి చూపించారు కూటమి నేతలు. దీంతో విచారణ జరిపిన ఈసీ.. అమ్మిరెడ్డిని విధఉల నుంచి తొలగించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.