Anagani Satya Prasad: మాఫియాలు నడిపే జగన్‌కు డాక్యుమెంట్ల విలువ ఏం తెలుసు..
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:49 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్‌కు ఆస్తులు సృష్టించడం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
అమరావతి: మాఫియాలు నడిపే వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి విజన్ డాక్యుమెంట్ల విలువ ఏం తెలుస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి, పెరిగిన ప్రవాసాందుల ఆదాయాలు విజన్ 20 -20 విజయానికి తార్కాణాలు అని తెలిపారు. విజన్ 20-20 ద్వారా ఇంటికో ఐటీ ఉద్యోగిని తయారు చేశామని మంత్రి సత్య ప్రసాద్ అన్నారు.
విజన్ 2047 ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్తను కచ్చితంగా తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్‌కు ఆస్తులు సృష్టించడం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగన్ పదే పదే చెప్పే అబద్ధాలను నమ్మకనే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు విజన్ అర్థం చేసుకుంటే భవిష్యత్తులో కనీసం నాయకుడిగానైనా ప్రజలు గుర్తిస్తారని మంత్రి సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
వారికి కఠిన శిక్షలు తప్పవు..
కాగా.. భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. భూదందాలపై ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అరాచకపాలనలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని మండిపడ్డారు. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
ఫ్రీ హోల్డ్ పేరిట జగన్ ప్రభుత్వం భూములను దోచుకుందని అనగాని సత్య ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములు, చుక్కలు భూములపై రీ వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. 22ఏ కింద ఉన్న భూములను 6 లక్షల ఎకరాలును గత ప్రభుత్వం తీసి అమ్ముకుందని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సామాన్య వర్గాల అసైండ్ భూములను బెదిరించి లాక్కున్నారన్నారు.
రీ వెరిఫికేషన్..
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. రాష్ట్రంలో వీటన్నింటిపై ప్రభుత్వం రీ వెరిఫికేషన్ చేపట్టిందని అన్నారు. గత సీఎం క్రిమినల్ మైండ్‌తో భూ అక్రమాలు జరిగాయని.. అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం
TTD: తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..
Read Latest AP News and Telugu News