Pardhasaradhi: జగన్ ప్రభుత్వం ఆ పైసలను పక్కదారి పట్టించింది
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:29 PM
BJP MLA Pardhasaradhi: వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి సంచలన ఆరోపణలు చేశారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వాలు వేసే పాలకమండళ్లకు, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి దేవాలయాలపై అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చుని తెలిపారు.
విజయవాడ: జగన్ ప్రభుత్వంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ దేవుడి హుండీ మీద మాత్రం ఉందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆలోచన చేస్తుందని అన్నారు. ధూప, దీప నైవేద్యాలకు కాకుండా నిధులను వేరే విధంగా వినియోగిస్తున్నారన్నారు. హైందవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశ్యంతో హైందవ శంఖారావం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైందవ శంఖారావం రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, సాధు సంత్‌లు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పారు.. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలనేది తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వాలు వేసే పాలకమండళ్లకు, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి దేవాలయాలపై అంత భక్తి శ్రద్ధలు ఉండకపోవచ్చుని తెలిపారు. ఏ ఆలయాన్ని వేరు చేసి చూడటం లేదని... కచ్చితంగా స్వయం ప్రతిపత్తి అనేది తిరుమలకు కూడా వర్తిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivasa Rao: మంత్రుల మార్పుపై.. పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
AP High Court: పేర్నినానికి హైకోర్టులో స్వల్ప ఊరట
AP News: చిత్తూరు జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ
AP News: న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఏపీ మంత్రి.. కారణమిదే
Read Latest AP News And Telugu News