Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?
ABN , Publish Date - Jun 15 , 2024 | 05:16 PM
తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
అమరావతి: తనకు, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఏ పద్ధతుల్లో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తామని అన్నారు. నేడు(శనివారం) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ చేశారు.
ప్రజావినతుల స్వీకరణపై...
ఏపీ సచివాలయంలోనే వినతులు స్వీకరిస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రజావినతులు స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వాటి పరిష్కారానికి నిర్ధిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్రా వెసులుబాటులన్నీ అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ప్రజావేదిక ఉండి ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేది, కానీ జగన్ ప్రజా వేదికను కూల్చి వేశారని గుర్తుచేశారు.
ప్రజావేదికను విధ్వంస పాలనకు ప్రతీకగా అలానే ఉంటుందని ఉద్ఘాటించారు. ఆ శిథిలాలను తొలగించమని అన్నారు. త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తామని వివరించారు. పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచీ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు
AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!
AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..
Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్
Read Latest AP News and Telugu News