CM Chandrababu : ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏం చేయబోతున్నారంటే..?
ABN , Publish Date - Jul 16 , 2024 | 05:50 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈరోజు ( మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు.
కృష్ణాజిల్లా (గన్నవరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఈరోజు ( మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు. రాత్రికి అక్కడే బసచేసి రేపు(బుధవారం) పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి హస్తిన బాట పట్టడంతో చంద్రబాబు పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బాబు రేపు భేటీ కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం, ఇతర రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.