Share News

TDP: తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. నేటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం..

ABN , Publish Date - Oct 26 , 2024 | 08:46 AM

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ్టి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలాగానే రూ.100లు కట్టి సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ శుభవార్త చెప్పింది. ఎవరైనా లక్ష రూపాయలు కడితే వారికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.

TDP: తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. నేటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం..
AP CM Chandrababu Naidu

అమరావతి: టీడీపీ సభ్యత్వ (TDP Membership) నమోదు కార్యక్రమాన్ని మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) పునః ప్రారంభించనున్నారు. టీడీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం నాడు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సభ్యత్వ నమోదును 175 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో చేపట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో నేటి నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు టీడీపీ శ్రీకారం చుట్టింది.


ఎప్పటిలాగానే రూ.100లు కట్టి సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ శుభవార్త చెప్పింది. ఎవరైనా లక్ష రూపాయలు కడితే వారికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5 లక్షల వరకూ అందిస్తారు. గతంలో ఇది రూ.2లక్షల ఉండగా ప్రస్తుతం రూ.5లక్షలకు పెంచారు. చనిపోయిన కార్యకర్తలకు మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు తక్షణసాయం అందజేస్తారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం సాయం అందిస్తారు.


ఇవాళ జరిగే కార్యక్రమంలో గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రూ.2లక్షల చొప్పున పార్టీ తరఫున చంద్రబాబు అందించనున్నారు. ప్రమాద బీమా కింద ఇప్పటివరకూ టీడీపీ రూ.102 కోట్లు ఇవ్వగా.. సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్ల వరకూ టీడీపీ సహాయం అందించింది. ఈ మేరకు తెలుగు తమ్ముళ్లు ఆనందంలో ముగినిపోతున్నారు. ఒకవేళ అనుకోని ప్రమాదాలు సంభవిస్తే తమ కుటుంబాలకు అండగా ఉండేందుకు టీడీపీ ముందుకు వస్తుండడంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు తెలుగు తమ్ముళ్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

Chandrababu : తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు

Updated Date - Oct 26 , 2024 | 08:53 AM