Share News

DGP Dwaraka Tirumala Rao: పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన డీజీపీ ద్వారక తిరుమలరావు

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:02 PM

డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.

DGP Dwaraka Tirumala Rao: పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన  డీజీపీ ద్వారక తిరుమలరావు

అనంతపురం: హోంమంత్రి అనిత, పోలీసులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు స్పందించారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారక తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దుష్టశిక్షణ.. శిష్టరక్షణ ఇదే తమ విధానమని చెప్పారు. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో తాము పని చేయమని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కామెంట్ చేయనని అన్నారు. ఐజీ సంజయ్‌పై విచారణ జరుగుతోందని...దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు.


వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని స్పష్టం చేశారు. ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛా అంటూ గతంలో నీరుగార్చారని అన్నారు. డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని తెలిపారు. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.


పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

pawan.jpg

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు ఏమాత్రం బాగోలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నేరస్థులకు కులం, మతం అనే భేదాలు ఉండవని చెప్పారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని అన్నారు. మంత్రి స్థానంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మెలగాలని, చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని పవన్ చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే తానే హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు.


లైంగిక దాడులపై పవన్ ఆందోళన..

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదని మండిపడ్డారు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.


పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదు: హోంమంత్రి వంగలపూడి అనిత

anitha-vangalapudi.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని ఆమె అన్నారు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంతో మాట్లాడారో తెలుసని, త్వరలోనే దాని గురించి ఆయనతో మాట్లాడతానని అనిత చెప్పుకొచ్చారు. ఏపీలో శాంత్రిభద్రతల విషయమై సీఎం చంద్రబాబు, తాను పోలీసులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఆ చర్చల్లో పవన్ కూడా భాగమేనని అన్నారు. ఉప ముఖ్యమంత్రికి అన్నీ విషయాలు తెలుసని, ఆయన మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పూ లేదని అనిత చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 02:43 PM