Share News

GV Anjaneyulu: భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:36 PM

జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారు, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు.

GV Anjaneyulu: భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారం

పల్నాడు జిల్లా: ఏళ్లుగా ఎదురుచూస్తున్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారమవుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. అగ్రహారం భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలనియ సంబంధిత అధికారులను ఆదేశించారు. జగన్ పాలనలో తుపాకీలు గురిపెట్టి ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు. ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారని, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని మండిపడ్డారు. లంచాల పేరుతో రైతులను ఇబ్బందిపెడితే కఠినచర్యలు తీసుకుంటామని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.


వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు జగన్‌ కొల్లగొడితే గ్రామాల్లో స్థానిక వైసీపీ నేతలు మేసేశారని విమర్శించారు. కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా సమగ్ర భూకబ్జాల నియంత్రణ చట్టంతో శిక్షలు ఉంటాయని అన్నారు.భూకబ్జాలపై పదేళ్ల నుంచి 14ఏళ్ల వరకు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తెచ్చామని ఆంజనేయులు హెచ్చరించారు.


వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు పెరిగాయి: మంత్రి నారాయణ

P-Narayana.jpg

నెల్లూరు: ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా, ప్రవేట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా నాన్ బెయిల్ క్రింద 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని మంత్రి నారాయణ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ఏసీ నగర్‎లో ఇవాళ(శుక్రవారం) రెవెన్యూ సదస్సు జరిగింది.


ఈ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సపందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... 33 రోజుల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. సెంటు భూమి నుంచి కొన్ని ఎకరాలనూ కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని అన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని చెప్పారు. వైసీపీ అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకువచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.


భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పిస్తాం: మంత్రి అనగాని సత్య ప్రసాద్

Anagani-Satya-Prasad.jpg

బాపట్ల జిల్లా: వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తుందని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందన్నారు. ఏపీలో ప్రజలకు ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు వాళ్ల స్వలాభం కోసమే చేసుకున్నారని విమర్శించారు. భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.


ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

yarlagadda-venkatrao.jpg

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు చేపడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇవాళ(శుక్రవారం) రెవెన్యూ సదస్సు జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్లు వేశారు.ఈ సదస్సులో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కులో మహిళలకు 50శాతం కల్పించారని యార్లగడ్డ వెంకట్రావు గుర్తుచేశారు.


ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తిని జగన్ ఇవ్వాలని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు గుంటలు పూడ్చే పరిస్థితి తమ ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. రాష్ట్ర మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులు ఎక్కవగా తారుమారు చేశారని అన్నారు. గత10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసిన ఎమ్మార్వోలు తప్పులు చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు..

భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 05:36 PM