Share News

Home Minister Anitha: కాకినాడ పోర్ట్ వ్యవహారం.. హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్

ABN , Publish Date - Dec 08 , 2024 | 03:41 PM

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత చెప్పారు.

Home Minister Anitha: కాకినాడ పోర్ట్ వ్యవహారం.. హోంమంత్రి అనిత మాస్ వార్నింగ్

విశాఖపట్నం: ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి, బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌పై అందరికీ జాలి ఉండేదని... ఆరిలోవ పోలీస్ స్టేషన్ తుపాన్ షెల్టర్లు భవనంలో ఉండేదని చెప్పారు. విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ(ఆదివారం) హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారక తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ...2018లో పొలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు ఫర్నిచర్ ఇచ్చిన డివిస్ లాబోరేటరీస్‌కి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు.


పోలీస్ విభాగంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ విభాగంలో జీరో నుంచి అభివృద్ధిని మళ్లీ మొదలు పెట్టామన్నారు. పోలీస్ విభాగం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు రహదారిలో ఉన్న కల్వర్టును జీవీఎంసీ నుంచి కోటి రూపాయలు విడుదల చేసి మరమ్మత్తులు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.


విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకునందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులమీదుగా భూమి పూజ జరిగిన ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తుచేశారు. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాదితులు సహకార కేంద్రం ప్రారంభించామని అన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. రోడ్డు ప్రమాద బాధితులు సహాయం కోసం 7995095793 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు..కొన్ని ఇన్యూరెన్స్ పాలసీల్లో మార్పు రావాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.


అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఆటోల వల్ల కొంత సమస్య ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ట్వీట్‌లు పెరిగాయని చెప్పారు. వైసీపీ పాపాలు బయట పడుతుంటే ట్వీట్ చాటున బాధితులు బయటకు వస్తున్నారని తెలిపారు. విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వామ్యులు అయ్యారని బయట పడుతోందన్నారు. కనీస విలువలు లేని శకుని లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. పెద్ద వాళ్లపై విజయసాయి మాటలు బాధకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.


కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని తెలుస్తున్నాయని అన్నారు. వైసీపీ నేతలు అందరినీ బెదిరించారని ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణా మీద సీబీసీఐడీ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ చక్కగా పని చేస్తోందని ప్రశంసించారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైసీపీ నేతలు పాత్ర ఉందని విమర్శించారు. విశాఖలో మాజీ ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ అక్రమాలు బయటకు వచ్చాయన్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్వహణ సరిగా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టామన్నారు. నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నామన్నారు. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలు పెట్టిందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..

సీఆర్డీయేలో లంచాల బోగోతం..

బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 08 , 2024 | 03:58 PM