Share News

Atchannaidu: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

ABN , Publish Date - Jun 14 , 2024 | 10:21 PM

వ్యయసాయాభివృద్ధికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

 Atchannaidu: వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
Kinjarapu Atchannaidu

అమరావతి: వ్యయసాయాభివృద్ధికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను అంతఃకరణ శుద్దితో నిర్వహించి ప్రతిక్షణం రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.


రైతుల ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తానని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన సబ్సిడీ యంత్రాలు, యంత్ర పరికరాలు, మైక్రో ఇరిగేషన్ వంటి అన్ని పథకాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తనవంతుగా కృషి చేస్తానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jun 14 , 2024 | 10:22 PM