Kolusu Partha Sarathy: విద్యుత్ భారాల పాపం జగన్ రెడ్డిదే.. మంత్రి పార్థసారథి విసుర్లు
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:25 PM
Kolusu Partha Sarathy: ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్‌గా సీఎం చంద్రబాబు మార్చారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
అమరావతి: విద్యుత్ భారాల పాపం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. గత ఐదేళ్లతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకు రూ.1400 కోట్లు ముట్టజెప్పి... కేపీహెచ్‌బీలో 10 ఎకరాలు జగన్ బినామీలు కొట్టేశారని ఆరోపించారు. విద్యుత్ రంగంలో రూ.50 వేల కోట్లు జగన్ అప్పులు పెట్టారని విమర్శించారు. ఒక్క విద్యుత్ రంగంలోనే జగన్ మోహన్ రెడ్డి రూ.1,29,500 కోట్లు నష్టాన్ని పెట్టి వెళ్లారని అన్నారు. 2014 – 2019లో చంద్రబాబు పాలనలో మిగులు విద్యుత్ ఉత్పత్తి చేసి జగన్ చేతిలో పెట్టి వెళ్లారని మండిపడ్డారు. ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్‌గా సీఎం చంద్రబాబు మార్చారని అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
జగన్ హయాంలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు: మాజీ ఎమ్మెల్యే వర్మ
కాకినాడ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. జగన్ అవినీతి మూలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలపై రూ. 1.29 వేల కోట్ల భారం పడిందని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంపు వల్ల ప్రజలపై రూ. 32 వేల 166 కోట్లు భారం పడిందన్నారు. విద్యుత్ సంస్థల కోసం రూ.49 వేల కోట్లు అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆరోపించారు. జెన్కో విద్యుత్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అన్నారు. 2023, 24 సంవత్సరాల్లో జగన్ పెంచిన విద్యుత్ చార్జీలే ఇప్పుడు పెరిగాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమేదో విద్యుత్ చార్జీలు పెంచినట్లుగా వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని వర్మ విమర్శించారు.
గిరిజనులను ఆదుకునేది కూటమి ప్రభుత్వమే: మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
అల్లూరిజిల్లా (పాడేరు): వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే కరెంట్ చార్జీలు పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పదిసార్లు కరెంట్ చార్జీలు పెంచినప్పుడు నోరుమూసుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు రోడ్లెక్కడం విచిత్రంగా ఉందని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో గెలిచినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఇక్కడ ఉన్న గిరిజన సమస్యలపై మాట్లాడాలని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అందించిందని గుర్తుచేశారు. గిరిజనులను ఆదుకునేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని గిడ్డి ఈశ్వరి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News