AP NEWS:అదానికి లీజుకు ఆ స్థలం.. ఆర్టీసీ ఉద్యోగుల సంచలన లేఖ..
ABN , Publish Date - Nov 25 , 2024 | 09:44 PM
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు.
అమరావతి: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సీ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానీకి లీజుకు ఇచ్చారని చెప్పారు.
ఈ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వార్తా కథనాలు వచ్చాయని అన్నారు. ఈ స్థలాన్ని ఆర్టీసీ సంస్థ అంతర్గత నిధుల ద్వారాగాని, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతోగాని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సుల అవసరాలు తీర్చుకోవచ్చని తెలిపారు. ఈ స్థలాన్ని రౌండ్ క్లాక్ సోర్స్‌గా రాత్రి వేళల్లో విండ్ ఎనర్జీని, పగటి వేళల్లో సోలార్ ఎనర్జీని 24గంటలు ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకుని హైబ్రిడ్ ప్రాజెక్టుగా చేసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తు అవసరాల రీత్యా SECI పేరుతో అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయించాలని కోరారు.
విద్యుత్ ఒప్పందాల్లో ఆరోపణలు...
విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.