Share News

Minister Anagani: వైసీపీ నేతలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 06 , 2024 | 06:32 PM

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు.

Minister Anagani: వైసీపీ నేతలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు..
Minister Anagani Satya Prasad

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఇవాళ (బుధవారం) జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 స్థానంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్-2024కు ఆమోద ముద్ర వేసిన సంగతి విధితమే. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఏపీలో చేసిన విచ్చలవిడి భూ దందాలను సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు.


వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని, పేదల భూములను ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరించాలని పలువురు మంత్రులు మండిపడ్డారు. వారి భూ దాహానికి ఎంతో మంది ప్రజలు నష్టపోయారని సీఎంకు చెప్పారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్-2024కు ఆమోదం తెలిపింది. అయితే క్యాబినెట్ సమావేశం అనంతరం ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుంది. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. వారి వల్ల నష్టపోయామంటూ భూకబ్జాలపై ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతి రోజూ వేల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయేవారని బాధితులు చెబుతున్నారు.


ఇకపై ఈ పరిస్థితి మారబోతుంది. రాష్ర్టంలోని అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే చట్టం వర్తిస్తుంది. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారికి 10 నుంచి 14 ఏళ్లపాటు జైలు శిక్షతోపాటు భారీ స్థాయిలో జరిమానా విధించేలా చట్టం రూపొందించాం. కబ్జాదారునికి అక్రమాస్తులు ఉంటే వాటినీ కబ్జాలుగా పరిగణించి జప్తు చేస్తాం. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తాం. బాధితులు కోర్టుకైనా వెళ్లవచ్చు లేదా కలెక్టర్ నాయకత్వంలోని కమిటీకైనా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet: ఈ అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ

AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్.. ఫోన్ చేస్తే రియాక్ట్ కావడం లేదు..

US Elections Result 2024: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు

Updated Date - Nov 06 , 2024 | 06:32 PM