Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 15 , 2024 | 11:58 AM
ఏపీలో లిక్కర్ రేట్లు చాలా తక్కువ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
అమరావతి: మద్యం పాలసీ విధానంపై ఏపీ శాసనమండలిలో ఇవాళ(శుక్రవారం) చర్చ జరిగింది. లిక్కర్ పాలసీని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్పుబట్టారు. దువ్వాడ శ్రీనుకు మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు.దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.18వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. లిక్కర్ రేట్లపై కమిటీ వేశామని స్పష్టం చేశారు.
మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో లిక్కర్ రేట్లు తక్కువ అని చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. లిక్కర్ దోపిడీ వెనుక సూత్రధారులను బయటకు లాగుతామని అన్నారు. లిక్కర్ స్కాంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఏపీలో నూతన మద్యం పాలసీ (AP News Liquor Policy) అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది సర్కార్. జగన్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం (AP Govt) మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. జూన్ నుంచి ప్రతినెలా 9 శాతం పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్ధతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.
ఇకపై ఏపీవ్యాప్తంగా అన్ని లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయనుంది. అన్ని షాపుల్లోనూ ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు మద్యం టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రతి మద్యం దుకాణంలోనూ ఆన్‌లైన్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. లాటరీ ప్రక్రియ విజయవంతం అయ్యింది. అలాగే టెండర్ల కోసం విదేశాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు గాను 89882 దరఖాస్తులు వచ్చాయి.
పారదర్శకంగా నూతన మద్యం పాలసీ
ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలోని 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించగా.. రికార్డుస్థాయిలో 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఒక్కో షాపునకు సగటున 25 మంది దరఖాస్తు చేశారని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. లాటరీ నిర్వహించి మద్యం షాపులు కేటాయించినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ ద్వారా విక్రయాలు జరగనున్నట్లు వెల్లడించారు.
జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు
"దరఖాస్తుల స్వీకరణ, మద్యం షాపుల కేటాయింపు సజావుగా జరిగింది. ఇకపై ఏపీలో మద్యం విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కొత్త బ్రాండ్స్‌ను టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’’ అని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News