Nadendla Manohar: పవన్ కల్యాణ్ లక్ష్యమిదే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 08:18 PM
Minister Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు చెల్లించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాజమండ్రి: కూటమి ప్రభుత్వంలో రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్రియాశీల సభ్యత్వం ఉండి చనిపోయిన 21 మంది కుటుంబ సభ్యులకు రాజానగరంలో చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. జనసేన క్రియాశీలక సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ప్రశ్నించే మనస్తత్వం ఉండాలనేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావమని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
వైసీపీ పాలనలో చాలా కార్యక్రమాలు పోలీసులను, రోప్ పార్టీలను పెట్టి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. గతంలో రాజమండ్రిలో జరిగే పవన్ కల్యాణ్ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని అన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పవన్ పని చేస్తున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ పదవుల కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తాము పొత్తు ధర్మం పాటించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పులపాలు చేసి రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదనిప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాలోనే రైతులకు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వంలో చెల్లించామని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రూ. 600 కోట్లు ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 24 గంటల్లోపే రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News