Share News

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 05:14 PM

Minister Sandhya Rani: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు.విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆక్షేపించారు.

AP NEWS: విజయసాయిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంచలన ఆరోపణలు
Minister Sandhya Rani

అమరావతి: జగన్ ప్రభుత్వంలో పది సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మనమే చార్జీలు పెంచి మనమే ధర్నా చేయటం ఏంటని వైసీపీ నేతలు అనుకుంటున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మతిభ్రమించిందని విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి బంధువుల నాసిరకం బొగ్గుతో విద్యుత్ సంస్థకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. విజయసాయిరెడ్డి అండ్ కో వేలాది కోట్లు దోచిన ఘనులని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంప వదిలి రాని జగన్ ఇప్పుడు తగుదనమ్మ అంటూ బయలుదేరారని ఆక్షేపించారు. రైతులు ధాన్యం అమ్మిన మూడు గంటల్లో వారి ఖాతాలో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు. రాక్షస పాలన ఎలా ఉంటుందో మీరు చూపిస్తే ప్రజా రంజక పాలన ఎలా ఉందో చంద్రబాబు చూపిస్తున్నారని ఉద్ఘాటించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ జల్సా పథకాలు అందరు చూశారని మంత్రి సంధ్యారాణి తీవ్ర విమర్శలు గుప్పించారు.


కూటమి ప్రభుత్వంపై వైసీపీవి అసత్య ఆరోపణలు: మంత్రి గొట్టిపాటి

gottipati-ravikumar-ministe.jpgకూటమి ప్రభుత్వంపై వైసీపీవి అసత్య ఆరోపణలు అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ హయాంలోనే జరిగిందని చెప్పారు. పదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ప్రతిపాదించి వైసీపీ మళ్లీ ధర్నాలు చేయడం తుగ్లక్ చర్య అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..

CM Chandrababu: మన్మోహన్ సింగ్‌ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 27 , 2024 | 06:51 PM