MLC Anuradha: గౌడ, బీసీ అని చెప్పుకునే అర్హత జోగి రమేశ్‌కు లేదు: ఎమ్మెల్సీ అనురాధ
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:35 PM
గౌడ, బీసీ అని చెప్పుకునే కనీస అర్హత వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthy Anuradha) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో తన కుమారుడు జోగి రాజీవ్(Jogi Rajeev) అరెస్టు కావడంతో జోగి రమేశ్(Jogi Ramesh) కుల ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అమరావతి: గౌడ, బీసీ అని చెప్పుకునే కనీస అర్హత వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthy Anuradha) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో తన కుమారుడు జోగి రాజీవ్(Jogi Rajeev) అరెస్టు కావడంతో జోగి రమేశ్(Jogi Ramesh) కుల ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తన కుటుంబంపై దాడులు చేసి అక్రమ అరెస్టు చేశారంటూ ఆయన మాట్లాడడం సబబు కాదని ఎమ్మెల్సీ అన్నారు. జోగి అక్రమాలు బయటపడడంతో కులం రంగు పులుమి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వృద్ధురాలిని చంపి చంద్రబాబుపై నెట్టారు..
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ పూర్తి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడని ఎమ్మెల్సీ అనురాధ వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు చేసిన దాడులు, అక్రమాలు ఎవ్వరూ మర్చిపోలేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. అధికారమదంతో పెనమలూరులో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలిని ఎండలో నిలబెట్టి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యావని జోగిపై మండిపడ్డారు. ఆ నెపాన్ని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మీదకి నెట్టాలని చూశావంటూ అతనిపై మండిపడ్డారు.
అమర్నాథ్‌ను హత్య చేసినప్పుడు ఏం చేశారు?
గత వైసీపీ ప్రభుత్వంలో తన అక్కను వదిలిపెట్టాలంటూ వేడుకున్న బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను అత్యంత కిరాతకంగా చంపినప్పుడు ఎందుకు నోరు మెదపలేదంటూ జోగి రమేశ్‌పై అనురాధ నిప్పులు చెరిగారు. మీరు చేసిన పాపాలు, అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాలు అన్నింటికీ శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉండగా అడ్డగోలు వ్యవహారాలు చేసి ఇప్పుడు అవి సాక్ష్యాధారాలతో సహా బయటపడుతుంటే అక్రమ అరెస్టు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. మీ కుమారుడు అరెస్టుకు కులం రంగు పులిమి రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్త కూడా చదవండి:
Minister Parthasarathy: జోగి రమేశ్ మాటలు అవివేకానికి నిదర్శనం: మంత్రి పార్థసారథి..