MLC Anuradha: పోలవరాన్ని మాజీ సీఎం జగన్ అదోగతి పాలు చేశారు: ఎమ్మెల్సీ అనురాధ
ABN , Publish Date - Jun 18 , 2024 | 02:56 PM
ఆంధ్రుల జీవనాడి పోలవరం (Polavaram)ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) అన్నారు. 20ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు.
అమరావతి: ఆంధ్రుల జీవనాడి పోలవరం(Polavaram)ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) అన్నారు. 20ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. కమీషన్ల కోసం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని మండిపడ్డారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 72శాతం పనులు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒక్క రోజులో 35వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని అనురాధ గుర్తు చేశారు. ఒక్క చాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పీక్కు తిన్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకుని ప్రాజెక్టును గోదాట్లో ముంచారని ఎమ్మెల్సీ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే 7.20లక్షల ఎకరాలకు సాగునీరందేదని, 23లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయ్యేదని తెలిపారు. ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల్లో 48మండలాలు, 548గ్రామాలకు సైతం తాగునీరు అందేదన్నారు. పోలవరం పూర్తయి ఉంటే విశాఖ పారిశ్రామికి హబ్‌గా ఎదిగేదని, పొరుగు రాష్ట్రాలు ఛత్తీశ్‌గఢ్, ఒడిశాకు నీళ్లు ఇచ్చేవాళ్లమని ఆమె చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని జగన్ రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడని దుయ్యబట్టారు. ఇదేనా మీరు ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి అని మండిపడ్డారు. "పోలవరం పూర్తి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే" అని ఎమ్మెల్సీ అనురాధ ఉద్ఘాటించారు.
ఇది కూడా చదవండి:
TDP: జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని