Share News

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:38 PM

ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghurama Krishnamraju) అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు.

AP Politics: పోలీసులు అలా ఎందుకు చేశారు.. ఎంపీ రఘురామ తీవ్ర ఆగ్రహం

ఢిల్లీ: ఏపీలో15వ తేదీ లోపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని.. తన దగ్గర సమాచారం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) అన్నారు. ప్రజలు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారని చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని.. పోలీసుల దాడులను ప్రజలు తట్టుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan), వైసీపీ నేతలు తిరుమల రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై పోలీసులు చాలా దాడులు చేశారని అన్నారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలే కానీ వైసీపీ నేతలకు కొమ్ముకాసేలా ఉండకూడదని చెప్పారు.

వారు ఎవరికైతే మద్దతుగా ఉంటున్నారో ఆ నేతలు రాబోయే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతారని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఓ కారు మీద జగన్ ఫొటో వేసుకొని ఓటు వేయాలని ఓ పార్టీకి సీఐ ఎలా ప్రచారం చేశారని నిలదీశారు. పోలీసులు భక్షక భటులుగా మారి ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీలో త్వరగా ఎన్నికల కోడ్ వస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. కొందరు తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు ఇప్పటికైనా ప్రజలకు రక్షణగా ఉండాలని ఎంపీ రఘురామ సూచించారు.

ఇవి కూడా చదవండి...

Devineni Uma: స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

Nara Lokesh: జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 03:38 PM