AP Politics: అరెస్ట్ ప్రచారంపై వైసీపీకి దిమ్మతిరిగేలా లోకేష్ సమాధానం
ABN , Publish Date - Jan 27 , 2024 | 06:04 PM
డీపీ నేతలపై వైసీపీ(YCP) మూకలు సోషల్ మీడియాలో వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh), టీడీపీ నేతలు వీరిని పలుమార్లు హెచ్చరించినా వీరి పద్ధతి మాత్రం మారడం లేదు.
అమరావతి: అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ను అరెస్ట్ చేశారంటూ వైసీపీ దుష్ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మొదటిసారిగా స్పందించిన లోకేష్.. వైసీపీకి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చారు. ‘‘అమెరికాలో మనీ లాండరింగ్ కేస్‌లో అరెస్ట్ చేసింది నన్నా..? జగన్ రెడ్డినా..? జగన్ కూతురునా..? భారతి రెడ్డినా..? నా మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన గాడిదలను అడగండి.. అందరూ జగన్ లాగా దొంగలు ఉండరు’’ అని నారా లోకేష్ హెచ్చరించారు.
కాగా.. టీడీపీ నేతలపై వైసీపీ (YSRCP) మూకలు సోషల్ మీడియాలో వ్యంగంగా పోస్టులు పెడుతూ పైత్యం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్.. అమెరికాలో అరెస్ట్ అయ్యారంటూ పుకార్లు సృష్టించారు. ఈ విషయంపై లోకేష్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుంచి గన్నవరానికి కాసేపటి క్రితమే యువనేత చేరుకున్నారు.