Share News

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

ABN , Publish Date - Dec 08 , 2024 | 05:15 PM

ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.

Nimmala Ramanaidu:వారిపై నిందలు మోపిన దుర్మార్గుడు జగన్.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం

పశ్చిమగోదావరి: జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవటానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.


ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాదిమంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి , చెళ్లళ్లకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


కూలీలు దొరకని పరిస్థితి ఉంది:కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani-Chandra-Sekhar.jpg

గుంటూరు జిల్లా: మంచి దిగుబడి వచ్చే పత్తి విత్తనాలు, పెరిగిపోతున్న చీడ, పీడలపై కూడా పరిశోధన చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. కాకుమానులో ప్రసాద్ సీడ్స్ నిర్మిస్తున్న అగ్రికల్చర్ ఇన్నోవేషన్ సెంటర్‌కు ఇవాళ(ఆదివారం) కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంఖుస్థాపన చేశారు. కాకుమాను జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతులు, కమ్యూనిటీ హాల్‌ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ... వ్యవసాయానికి కూలీలు దొరకని పరిస్థితి ఇప్పుడు ఉందని అన్నారు. లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని చెప్పారు. డ్రోన్ శిక్షణ సెంటర్‌ను పెట్టి వెయ్యి మందిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మున్ముందు రోజుల్లో అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేస్తున్నారని అన్నారు. డ్రైవర్ లెస్ ట్రాక్టర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.


రైతు అంటే వ్యక్తి కాదు వ్యవస్థ: ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

రైతు అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. రైతులు ఊరు వదిలి వెళ్లిపోయే ప్రరిస్థితి నెలకొందని అన్నారు. తమ కొడుకులను హోంగార్డు ఉద్యోగాలకు పంపేందుకు రైతులు నేడు సిద్ధమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టుబడి పెట్టే రైతుకు గ్యారంటీ ఆదాయం వస్తుందని చెప్పగలిగే పరిస్థితి ఈ రోజుల్లో లేదని చెప్పారు. యాంత్రీకరణ జరిగితే కూలీల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న వస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 05:20 PM