Pawan Kalyan:ఉపాధి హామీ నిధులపై పవన్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:50 PM
ఉపాధి హామీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై ఈరోజు(గురువారం) పవన్ సమీక్షించారు.
అమరావతి: ఉపాధి హామీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధుల వినియోగం, సోషల్ ఆడిట్ నిర్వహణపై ఈరోజు(గురువారం) పవన్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ అధికారులతో రెండున్నర గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకంపై సోషల్ ఆడిట్ జరిగే తీరు, నిధుల దుర్వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ALSO Read: Pawan Kalyan: పలు శాఖల అధికారులతో సమీక్షలు.. బిజీబిజీగా పవన్
సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, అందుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఉపాధి మేట్ల పరిధిలో జరిగిన పనులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతిపై చర్చించారు. నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, ఏమైనా దుర్వినియోగమయ్యాయా అని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. గ్రామీణ అభివృద్ధి మరింత విస్తృతంగా చేపట్టాలంటే ఏం చేయాలో ఆలోచించాలని అన్నారు. ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Chandrababu: ఉద్దండ రాయునిపాలెంలో ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు
YS Jagan: నాడు హేళన చేశారు.. నేడు పోరాడతామంటున్నారు..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News