Pemmasani: అలా చేస్తే ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయి.. పెమ్మసాని వార్నింగ్
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:09 PM
నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వారు అటువంటి పనులు మానుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గుంటూరు జిల్లా : నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మే వారు అటువంటి పనులు మానుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) అన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు అమ్ముతున్నారని మండిపడ్డారు. అలా చేస్తే ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించామని తెలిపారు. విత్తనాలు ఖచ్చితంగా టెస్ట్ చేసిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని సూచించారు. 6ఏ కేసులను కఠినతరం చేస్తాంమని అన్నారు. విత్తనాలు, ఎరువులపై కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. విజిలెన్స్, వ్యవసాయ శాఖ నిరంతరం తనిఖీలు చేపట్టాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు.