Purandeswari: ‘మన్ కీ బాత్’పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 29 , 2024 | 09:19 PM
మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతీ శక్తి కేంద్రంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కోరారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు.
అమరావతి: మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతీ శక్తి కేంద్రంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) కోరారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు. రేపు (ఆదివారం) మన్ కి బాత్ లో ప్రజలతో మాట్లాడుతారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా ఏర్పాటు చేసుకున్న శక్తి కేంద్రాల్లో మన్ కీ బాత్ వీక్షణకు ఏర్పాట్లు చేయాలని కోరారు.
జిల్లా కార్యవర్గాలు వీటి పర్యవేక్షించాలని సూచించారు. జూలై 8వ తేదీన రాష్ట్ర స్ధాయి బీజేపీ విస్తృత కార్యవర్గం సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల అనంతరం విస్తృత కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలో ఒక రోజు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
మండల అధ్యక్షులతో సహా జిల్లాలో బాధ్యతలు ఉన్నవారు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. పార్టీ అనుబంధ మోర్చాలు , ఇతర బాధ్యతలు ఉన్నవారు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని సరోవర్ కన్వెషన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.