Share News

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:10 PM

కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల
APCC chief Sharmila Reddy

కడప: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి, తనపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డే పోస్టులు పెట్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారని.. అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్టు చేయడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్మ నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.


ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. "సోషల్ మీడియా సైకో వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి విచారణ చేయాలి. రవీందర్ రెడ్డిపై కడప జిల్లాలో నేను కేసు పెట్టినా, పెట్టకపోయినా పోలీసులు విచారణ కొనసాగించాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఎవరో వాటిని పెట్టించింది ఎవరో పోలీసులు నిగ్గు తేల్చాలి. సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి దీనికంతటికీ మూల కారణం. అతన్ని పోలీసుల ఎందుకు అరెస్టు చేయలేదు. సజ్జల భార్గవరెడ్డిని, అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం చొరవ చూపాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉక్కు పరిశ్రమ కోసం రెండుసార్లు టెంకాయ కొట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఉక్కు పరిశ్రమపై దృష్టి పెట్టాలి. జిల్లాలో ఉక్కు పరిశ్రమ కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Sharmila2.jpg


కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయింది. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయింది. కానీ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు వెళ్లడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన మా అన్న జగన్.. ఆస్కార్ డైలాగ్స్ చెప్పి మళ్లీ టెంకాయ కొట్టి మరో సంస్థకు బాధ్యతలు అప్పగించారు. జమ్మలమడుగు రుణం తీర్చుకుంటానని చెప్పి వారిని మోసం చేశారు. సజ్జన్ జిందాల్, జగన్ మోహన్ రెడ్డి బంధం ఎలాంటిదో సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత ఏపీ ప్రజలకు అర్థమయ్యింది. కడప స్టీల్ ప్లాంట్‌పై పాలకులకు ఎందుకంత చిన్నచూపే అర్థం కావడం లేదు. వివేకా హత్య కేసులో వేగం పెరగడం శుభపరిణామం. ఇప్పటికైనా సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. బాధితురాలైన సునీతకు తానెప్పుడూ అండగానే ఉంటా" అని షర్మిల చెప్పారు.

ఇవి కూడా చదవండి...

రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్

పోస్ట్ఉడుము పవర్ అంటే ఇదీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 03:30 PM