Share News

Supreme Court: కడప కలెక్టర్ శివశంకర్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Oct 22 , 2024 | 08:04 PM

కడప కలెక్టర్ లోతేటి శివశంక్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్ క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను శివశంకర్ సవాలు చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court: కడప కలెక్టర్ శివశంకర్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఢిల్లీ: కడప కలెక్టర్ లోతేటి శివశంక్‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఏఎస్ క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను శివశంకర్ సవాలు చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్, హైకోర్టు తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును కడప కలెక్టర్ శివ శంకర్ ఆశ్రయించారు.


శివశంకర్ పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ బట్టి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల అనంతరం శివశంకర్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేడర్ డివిజన్ చేస్తూ డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.


ఏపీలోనే కొనసాగించాలి..

కాగా ... తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు. తెలంగాణలో రిపోర్టు చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కె.సృజన, కడప జిల్లా కలెక్టర్‌ తోలేటి శివశంకర్‌ గతంలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యను విన్నవించారు. తమ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని.. పోస్టింగ్‌ తీసుకునే సమయంలో తాత్కాలిక అడ్రస్‌ కింద హైదరాబాద్‌ చిరునామాలు ఇచ్చామని అన్నారు.


కేవలం అడ్రస్‌లో మార్పు వల్ల తమను తెలంగాణకు కేటాయించారని తెలిపారు. స్థానికత కింద తమను ఇక్కడే కొనసాగించేలా చూడాలని కోరారు. వారి అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించారు. డీవోపీటీ అధికారులతో మాట్లాడతానని, కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అంశం గురించి తనకు ముందే ఎందుకు చెప్పలేదని చంద్రబాబు కలెక్టర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. చెప్పిఉంటే కేంద్రంతో ఎప్పుడో మాట్లాడి ఉండేవాడినని అన్నట్లు సమాచారం. కాగా.. తెలంగాణలో రిపోర్టు చేయాలన్న డీవోపీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు కడప జిల్లా కలెక్టర్‌ తోలేటి శివశంకర్‌ వెళ్లిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి

AP Ministers: మూడు రోజులుగా ఢిల్లీలోనే ఏపీ మంత్రులు.. ఎందుకంటే

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 08:09 PM