Share News

Kothapalli Geetha: అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

ABN , Publish Date - Apr 04 , 2024 | 09:43 PM

అరకు (Araku) ఎంపీగా తనను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అరకు బీజేపీ (BJP) పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత (Kothapalli Geetha) అన్నారు. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అరకులో ఉన్న గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.

Kothapalli Geetha: అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా

అరకు: అరకు (Araku) ఎంపీగా తనను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అరకు బీజేపీ (BJP) పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత (Kothapalli Geetha) అన్నారు. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అరకులో ఉన్న గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. గురువారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకురావడంలో వైసీపీ ఘోరంగా విఫలం అయిందని మండిపడ్డారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో అరకు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని చెప్పారు.


AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..

మరోసారి తనను గెలిపించాలని కోరారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్తులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని చెప్పారు. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు చేయడంలో తాను ముందుంటానని అన్నారు. అరకులో ఇల్లీగల్ మైన్లు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. మోదీ ప్రభుత్వం మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అరకు ప్రాంతానికి కొంతమంది వ్యాపారం పేరిట వచ్చి అమ్మాయిలను ట్రాఫికింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.


Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...

2014లో ఈ సమస్యలపై ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదన్నారు. ఈసారి 2024 ఎన్నికల్లో ఎంపీగా తనను గెలిపిస్తే వీటిని అణచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని గీత పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధి అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే సాధ్యమని చెప్పారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మారుస్తానని అన్నారు. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఎంతగానో పాటు పడుతుందన్నారు. ఏపీలో కూటమి, కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని కొత్తపల్లి గీత ఆశాభావం వ్యక్తం చేశారు.


Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 09:46 PM