Tirumala Laddu: ముందున్న నందిని డైరీని ఎందుకు తప్పించారు: నేతి మహేశ్వరరావు
ABN , Publish Date - Sep 20 , 2024 | 04:46 PM
Andhrapradesh: తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మతం మార్చుకున్న వైవీసుబ్బారెడ్డికి చైర్మన్ సీటు కట్టబెట్టారని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: మత విశ్వాసాలతో కూడుకున్న అంశాల్లో కూడా వైసీపీ (YSRCP) పెద్దలు అవినీతికి కక్కుర్తిపడ్డారని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు (AP Professional Forum president Neti Maheswara Rao) అన్నారు. తిరుమల లడ్డు వివాదంపై ఆయన మాట్లాడుతూ.. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మతం మార్చుకున్న వైవీ సుబ్బారెడ్డికి చైర్మన్ సీటు కట్టబెట్టారన్నారు. వైసీపీ నేతలు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అన్ని మతాలను సమానంగా చూడాలన్న రాజ ధర్మాన్ని తుంగలో తొక్కారన్నారు. తిరుపతి లడ్డులలో జంతువుల కొవ్వు కలిసిన ఆవు నెయ్యిని వాడారన్న ల్యాబ్ నివేదికలను చూస్తే ఇది అర్థమవుతోందని తెలిపారు.
Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..
ఇక్కడ తిరుపతి లడ్లు దేశంలో హిందువులు పవిత్రంగా భావించే పరిస్థితి ఉందన్నారు. గతంలో ఉన్న నందిని డైరీ సంస్థను కాదని ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో ఉన్నవారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మాంసం ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన కంపెనీకి ఆవు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడంలో ఉన్న దురుద్దేశం అవినీతి సొమ్ము కోసమే అన్నది అర్థమవుతుందన్నారు. ‘‘మీరు తప్పు చేయకపోతే ముందున్న నందిని డైరీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందని నిలదీశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్లు ల్యాబ్‌లకు పంపించవద్దని హైకోర్టుకు ఎందుకు వెళ్లారని అడిగారు. ఒంగోలు నుంచి రేషన్ బియ్యం తిరుమల అన్నదానానికి వెళుతున్న అంశం వైసీపీకి తెలియకుండా జరిగిందా అని సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్నామని నేతి మహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
CM Chandrababu: తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సీరియస్
నెయ్యి నాణ్యత లేకపోవడంతో: ఈవో శ్యామలరావు
తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే లడ్డు నాణ్యత పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నెయ్యిలో నాణ్యత లేని కారణంగానే లడ్డులో నాణ్యత లోపించిందని పోటు కార్మికులు చెప్పారన్నారు. నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని.. నాణ్యతని పెంచాలని సప్లైదారుడిని హెచ్చరించామని చెప్పారు. నాణ్యతని పరిశీలించేందుకు టీటీడీకీ స్వంతంగా ల్యాబ్ లేదని.. టెండర్ దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరు సప్లై చెయ్యలేరని నిపుణులు చెప్పారన్నారు. తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని టెండర్ దారుడు సప్లై చేశారని తెలిపారు. 319 రూపాయలకే మార్చి 12 ఏఆర్ సంస్థ టెండర్ దక్కించుకొని.. మే 15 తరువాత సప్లై చేశారన్నారు. నెయ్యి నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్‌ల నెయ్యిని వెనక్కి పంపించేశామన్నారు. జూలై 6, 12 వ తేదీన నెయ్యి శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపామని.. నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు వివిధ రకాల కల్తీ జరిగినట్లు గుర్తించామని.. త్వరలోనే అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..
Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..
Read Latest AP News ANd Telugu News