YS Sharmila: జగన్ ప్రశ్నకు షర్మిల ధీటైన సమాధానం...
ABN , Publish Date - Jul 27 , 2024 | 11:09 AM
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్న అని చూడకకుండా జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక.. తన మాటలకు మరింత పదును పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు.
అమరావతి, జూలై 27: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila) ఫైర్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్న అని చూడకకుండా జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక.. తన మాటలకు మరింత పదును పెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు. తాజాగా మరోసారి జగన్‌ను టార్గెట్ చేస్తూ షర్మిల మాటల తూటాలు పేలారు.
YS Jagan: జగన్ పత్రికకు జనం సొమ్ము
జగన్ ఏమన్నారంటే?
ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయాంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా జగన్ ఆహ్వానం పంపారు. అయితే ఎన్డీయేలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలు మాట్లాడలేరు కాబట్టి వారంతా ధర్నాకు దూరంగా ఉన్నారు. అయితే ఇండియా కూటమిలోని కీలక పార్టీల నుంచి పలువురు నేతలు జగన్ ధర్నాకు వచ్చి మద్దతు తెలిపారు. కానీ.. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉండిపోయింది. దీనిపై నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ధర్నాకు ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు.
Andhra Pradesh: బయబటపడనున్న వైసీపీ నేతల బండారం..!
షర్మిల ఆన్సర్ ఇదీ...
దీనిపై తాజాగా షర్మిల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు... మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి?’’అంటూ తిరిగిప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదేళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని వైసీపీకి... ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అని నిలదీశారు. వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా అని అన్నారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే వైసీపీ వచ్చిందా సంఘీభావం అని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా...రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని సమాధానమిచ్చారు. సిద్దం అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్
AP News: రూ.2.20 కోట్లతో బ్యాంకు ఉద్యోగి పరార్.. పట్టిస్తే భారీ బహుమతి
Read Latest AP News And Telugu News