Share News

TDP: టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసు రీ ఓపెన్

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:21 PM

Andhrapradesh: టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. అప్పటిలో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసులో ఆయన కుడి కన్ను కోల్పోయిన విషయం తెలిసిందే. కుడి కంటి చూపు కోల్పోవడంతో అప్పట్లో గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చికిత్స చేయించారు.

TDP: టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసు రీ ఓపెన్
TDP Leader Chennupati Gandhi

అమరావతి, జూలై 4: టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై (TDP Leader Chennupati Gandhi) దాడి కేసును పోలీసులు (AP Police) రీ ఓపెన్ చేశారు. అప్పటిలో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసులో ఆయన కుడి కన్ను కోల్పోయిన విషయం తెలిసిందే. కుడి కంటి చూపు కోల్పోవడంతో అప్పట్లో గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) చికిత్స చేయించారు. అయినప్పటికీ చూపు రాదని వైద్యులు తేల్చిచెప్పేశారు. ఈ క్రమంలో ఈ కేసును రీ ఓపెన్ చేయాలని టీడీపీ నేతలు కోరారు.

CM Chandrababu: ప్రధాని మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ.. ఏమేం చర్చించారు..!?


అప్పటిలో వైసీపీ నేత దేవినేని అవినాష్ (YSP Leader Devnineni Avinash) అనుచరులు దాడి చేయడంపై టీడీపీ నేతలు (TDP Leaders) ఆందోళనకు కూడా దిగారు. దీంతో ఈ కేసులో వైసీపీ నేత వల్లూరు ఈశ్వర్ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో సెక్షన్లు మార్చాలని తెలుగుదేశం నేతలు పట్టుబడుతున్నారు. గతంలో సింపుల్ సెక్షన్లు పెట్టీ తూతూ మంత్రంలా దర్యాప్తు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. సింపుల్ సెక్షన్లు కావడంతో నోటీస్‌లు ఇచ్చి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. గాంధీపై దాడి కేసును హత్యాయత్నం కేసుగా పోలీసులు మార్చారు. ప్రస్తుతం ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నారు.

AP High Court: వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..


అసలేం జరిగిందంటే...

కాగా... 2022, సెప్టెంబర్‌లో చెన్నుపాటి గాంధీపై వైసీపీ వర్గీయులు దాడికి ఒడిగట్టారు. బలంగా పిడిగుద్దులు కురిపించడంతో ఆయన కుడి కన్నును కోల్పోయారు. పటమటలంకలో స్థానిక జిల్లాపరిషత్‌ పాఠశాలకు సమీపంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి చెన్నుపాటి గాంధీ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో పాఠశాల వద్ద డ్రైనేజీ పనులను పరిశీలించారు. స్కూటర్‌పై వెళ్లిపోతుండగా వైసీపీ నేతలు గద్దె కల్యాణ, సుబ్బు ఆయనను బాబాయ్‌ అని పిలిచారు. దీంతో గాంధీ ఆగారు. ‘డ్రైనేజీ సమస్యపై మేం మాట్లాడుకోలేమా!’ అం టూ గాంధీతో వాదనకు దిగారు. ఇంతలో పక్కనే ఉన్న సుబ్బు గాంధీ ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనలో గాంధీ కుడి కన్నుకు తీవ్ర గాయమైంది. ఆ తరువాత చికిత్స చేసినప్పటికీ కంటికి బలంగా గాయం తగలడంతో గాంధీ చూపును కోల్పోవాల్సి వచ్చింది.


ఇవి కూడా చదవండి...

AP News: నీట్‌ పేపర్‌లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆందోళన.. ఉద్రిక్తం

Peddirreddy : ఇంటి కోసం మున్సిపాలిటీ రోడ్డును ఆక్రమించిన పెద్దిరెడ్డి..

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 04 , 2024 | 12:24 PM