Share News

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:37 PM

తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

CM Chandrababu: అలా చేస్తే చర్యలు తీసుకుంటా.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

అమరావతి: తేమశాతంలో సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని.. కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవాకేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ(శుక్రవారం) సందర్శించారు. ఈ సందర్భంగా సేవ కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.


రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవాకేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా బాగా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వల్ల రూ. 5, 6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగడం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్ వాళ్లు తీసుకుంటే మరో రూ.5వేలు వరకూ వస్తుందని రైతు తెలిపారు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి రూ. 6వేలు కోతకు, మరో రూ. 6వేలు కుప్ప వేయడానికి అయ్యేదని రైతు తెలిపారు.


తొలకానికి మరో రూ. 3 వేలు ఖర్చు అయ్యేదని అన్నారు. ఈ లెక్కన అన్ని కలుపుకుని మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే రూ. 25వేలు దాకా ఖర్చు వచ్చేదని చెప్పారు. ధాన్యం డబ్బుల్లో కోత లేదు.. డబ్బులు కరెక్టుగానే వస్తున్నాయని చెప్పారు. ఇప్పడు ఉన్న వ్యవస్థ బాగానే పనిచేస్తోందని అన్నారు. కోత మిషన్లు బయటనుంచి వస్తున్నాయని వివరించారు. ప్రోక్యూర్మెంట్‌కు షెడ్యూలింగ్ మొత్తం ఒకటిగా లేదా... వేర్వేరుగా పంట కోత కోస్తే పార్ట్ షెడ్యూలింగ్ ఇస్తామని సీఎం చంద్రబాబుకు సేవాకేంద్రం సిబ్బంది వివరించారు. రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరి దగ్గరైనా బాగా పంట పండితే సాగు పద్ధతులు ఏంటో తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరి పంట వేసే రకం తినగలిగేది అయి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ గ్రామంలో ఎంత ప్రోడెక్టివిటీ వచ్చిందో చెప్పాలని అన్నారు. ధాన్యం తేమశాతాన్ని ఎలా గణిస్తారో స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించారు. సీజన్ ముందు అన్ని మిషన్లును తేమ విషయంలో క్యాలిబ్రేట్ చేస్తామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP NEWS: ఇంటికి కొరియర్.. ఓపెన్ చేయగానే డెడ్‌‌బాడీ... ఎవరిదంటే..

Bhuvaneswari: పేదలందరికీ ఇళ్లు.. ఎడ్యుకేషనల్ హబ్‌గా కుప్పం: నారా భువనేశ్వరి..

Duvvada Srinivas: విచారణకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 01:53 PM