Share News

TDP: టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Jul 10 , 2024 | 09:35 AM

Andhrapradesh: గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 14 మందిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు(బుధవారం) వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

TDP: టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో దర్యాప్తు వేగవంతం
TDP Office

కృష్ణా, జూలై 10: గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై (TDP Officer) దాడి ఘటనలో పోలీసులు (AP Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 14 మందిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు(బుధవారం) వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Amaravati : ప్రక్షాళన ఆరంభం


ఇదీ జరిగింది...

కాగా.. 2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లతో చెలరేగిన పోయిన అల్లరి మూక కార్యాలయంలోని ఫర్నీచర్‌తో ఆఫీసు అద్దాలు, కార్లను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. అయితే వీరిని అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడ్డారు. వారిపై రాడ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. గతంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోని విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. విధ్వంసం ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

Amaravati : టారిఫ్‌కు కట్టడి !

నంద్యాల సమీపంలో గిరిజనుడిపై చిరుత దాడి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 09:46 AM