Share News

Vijayawada: దారుణం.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..

ABN , Publish Date - Nov 29 , 2024 | 08:11 AM

ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్‌ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు.

Vijayawada: దారుణం.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..

ఎన్టీఆర్: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా పెరిగిపోయాయి. అప్పటివరకూ బాగానే ఉన్నవారు కళ్లేదుటే కుప్పకూలిపోతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. ముఖ్యంగా పెళ్లి బరాత్, ఇతర వేడుకల్లో నృత్యాలు చేస్తూ మృతిచెందడం సర్వసాధారణంగా మారిపోయింది. వీటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇలాంటి మరణాలకు వైద్యులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అప్పటివరకూ బాగానే ఉండి కుప్పకూలిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోటుకు కారణంగా పలువురు వైద్యులు చెబుతున్నారు.


అయితే తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. కుమార్ అనే డ్రైవర్ పని నిమిత్తం తన లారీతో గన్నవరానికి చేరుకున్నాడు. లారీ నడుపుతుండగా కుమార్‌ ఒక్కసారిగా గుండె పోటుకు గురయ్యాడు. నొప్పి తీవ్రంగా రావడంతో వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు ఆపేశాడు. నొప్పి విపరీతంగా రావడంతో క్యాబిన్‌లో విలవిల్లాడుతూ పడిపోయాడు. సీటులోనే కుప్పకూలి తీవ్ర వేదనకు గురయ్యాడు. పక్కన వెళ్తున్న వాహనదారులు సైతం అతన్ని గమనించలేదు. దీంతో ఏం చేయలేక క్యాబిన్‌లోనే ఉండిపోయాడు.


లారీ చాలా సేపటి నుంచి అక్కడే ఆగి ఉండడాన్ని గమనించిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెంటనే వాహనం వద్దకు చేరుకున్నాడు. డ్రైవర్ కుమార్ కుప్పకూలిపోయి నొప్పితో విలవిల్లాడటాన్ని ఆయన గమినించారు. దీంతో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి వాహనాన్ని రప్పించారు. అనంతరం అతన్ని విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే కుమార్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. స్పృహలోకి వచ్చిన కుమార్ తనను కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Cyclone Fengal: గంటకు 9 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఫంగల్ తుపాను..

AP News: సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు

Ram gopal Varma: ఇక నాపై కేసులు నమోదు చేయొద్దు!

Updated Date - Nov 29 , 2024 | 08:14 AM