AP News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ.... కీలక విషయాలపై చర్చ
ABN , Publish Date - Sep 10 , 2024 | 10:22 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు 20 నిమిషాల పాటు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు.విజయవాడ సహా... రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలతో సంభవించిన నష్టంపై కేంద్ర మంత్రికి వివరాలు తెలిపారు.
ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 20 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ ముఖ్య అధికారులు ఈరోజు(మంగళవారం) భేటీ అయ్యారు.విజయవాడతో సహా... ఏపీలోని పలు ప్రాంతాల్లో వరదలతో సంభవించిన నష్టంపై కేంద్రమంత్రికి వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికను నిర్మలా సీతారామన్‌కి అందజేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
ALSO READ: CM Chandrababu: జగన్ చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణం
కేంద్ర మంత్రితో సమావేశానికి ముందు పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు మాట్లాడి పలు సలహాలు, సూచనలు చేశారు. నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం ఏపీలో సంభవించిన వరదలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపినట్లు కేంద్రం దృష్టికి పయ్యావుల కేశవ్ తీసుకెళ్లారు. పట్టణ ప్రాంతాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని, చిన్న మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపినట్లు నిర్మలా సీతారామన్‌కి పయ్యావుల కేశవ్ వివరించారు.
ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వృత్తి పరమైన వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ రోజు రాష్ట్రంలోని బ్యాంకర్లతో భేటీ అయ్యారని, వరదల ప్రాంతాల్లో రుణాల చెల్లింపులు, బాధితులకు చేయూత ఇచ్చేందుకు సహకారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల చెల్లింపులు వాయిదా వేయాలని, వడ్డీలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ కోరారు.
ALSO READ: Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
భాదితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదో చంద్రబాబు చెప్పిన విషయాలను నిర్మలా సీతారామన్‌కు కేశవ్ వివరించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విషయాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తుది నివేదిక కూడా త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని కేశవ్‌కు నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం ఒక కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోందని, అవసరాన్ని బట్టి మరో బృందం కూడా రాష్ట్రానికి వస్తుందని పయ్యావుల కేశవ్‌కి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News