Share News

Satyakumar: నూతన విద్యా విధానం విద్యార్ధులకు ఓ వరం...

ABN , Publish Date - Aug 03 , 2024 | 02:42 PM

Andhrapradesh: అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందినూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారన్నారు.

Satyakumar: నూతన విద్యా విధానం విద్యార్ధులకు ఓ వరం...
Minister Satyakumar

విజయవాడ, ఆగస్టు 3: అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు నూతన విద్యా విధానంపై చర్చించడం ఆనందంగా ఉందన్నారు. నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారన్నారు. ‘‘యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను. మీరంతా విద్యావేత్తలు.. మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) రావాల్సి ఉన్నా. మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు’’ అని తెలిపారు.

Kerala: భారీ వర్షంలో.. గుహలో ఉన్న ఫ్యామిలీని..


గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టిందన్నారు. భారతీయ విద్యా విధానం రూపుమాపి.. బ్రిటీష్ విద్యను అమలు చేశారన్నారు. ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే.. యువశక్తిని ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలన్నారు. భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాల్సి ఉందన్నారు. బ్రిటీష్ విద్యను అమలు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అన్యాయం చేశారన్నారు. 1986 లో కొత్త విద్యా విధానం రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినా.. పూర్తిగా అమలు చేయలేదన్నారు. 2009 లో నాలెజ్డ్ కమీషన్ తీసుకు వచ్చి .. అందులో కొత్త విద్యా విధానం అమలు చేశారన్నారు. ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్దులపై బలవంతంగా రుద్దారన్నారు. గతంలో ఏదైతే బానిస విద్య వద్దనుకున్నామో.. అదే అమలు చేశారని మండిపడ్డారు. ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదని.. ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రైవేటు సంస్థలలో కూడా రాణించవచ్చన్నారు.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!


సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారని అన్నారు. ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే.. మాతృభాషను మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. చైనా, జపాన్‌లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలన్నారు. ప్రాధమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే.. వారిలో సృజనాత్మకత బయటకు వస్తుందన్నారు. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాషపై మోజు పెరిగిందన్నారు. ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉందన్నారు.దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల తాను ఇంజనీరింగ్ పూర్తి చేయలేక పోయానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ ద్వారా విద్యార్దులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.


ఆర్ధిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ రెవెల్యూషన్ వచ్చిన సమయంలో దేశం కూలీలను తయారు చేసిందన్నారు. గతంలో ఉన్న విద్యావవస్థల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేదన్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి కోసమే కాదు.. విద్య కోసం వలసలు పోయారన్నారు. ఇప్పుడు ఉన్న విద్యా విధానం విద్యార్ధులకు ఒక వరం లాంటిందన్నారు. గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్ధిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. నేడు మన దేశం ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి అగ్ర దేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు. నూతన విద్యా విధానం ద్వారా జరిగే మంచిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా వివరించాలని.. అయితే కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అని అన్నారు.

Viral Video: కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని.. ఈ యువతి ఎలా ఆపిందో చూడండి..


రిక్రూట్ మెంట్‌పై తప్పకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రాలు సహకారం లేకపోవడం వల్ల భారం మొత్తం కేంద్రంపై పడుతుందన్నారు. విద్యపై ఏమాత్రం ఖర్చు పెట్టడం లేదనేది వాస్తవమన్నారు. నాడు నేడు పేరుతో కూడా కేంద్రం డబ్బులతోనే నిర్మాణాలు చేశారన్నారు. ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఇక విద్యా విధానం ఎలా మెరుగు పడుతుందన్నారు. విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర నిధులు ఇస్తున్నాయని అడిగారు. విద్యార్ధుల కోసం కేంద్రంతో పాటు, రాష్ట్రాలు కూడా ముందుకు రావాలని కోరారు. ఇప్పటి వరకు నూతన విద్యా విధానంలో వచ్చిన ఫలితాలు కేంద్రం వల్లే అని చెప్పుకొచ్చారు. ఈ నూతన విద్యా విధానం వల్ల భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందన్నారు. వారిలో ఉన్న సృజనాత్మకత కారణంగా మంచి ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరిగాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది

Dokka: సమయం ఇవ్వకుండా కల్కి సినిమాలోలా కుట్రలు.. మాజీ మంత్రి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 03 , 2024 | 02:45 PM