IAS Officers Transfers: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ
ABN , Publish Date - Aug 03 , 2024 | 01:57 PM
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చిన్నస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారులు వరకూ భారీగా బదిలీలు జరిగిపోతున్నాయి.. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కూడా ఉన్నాయి. తాజాగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పట్నుంచి చిన్నస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారులు వరకూ భారీగా బదిలీలు జరిగిపోతున్నాయి.. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కూడా ఉన్నాయి. తాజాగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!
రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్
ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి
కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ
కి అదనపు బాధ్యతలు
రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్
మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
పురపాలకశాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక
హెచ్‌ఏసీఏ ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి
మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యారు.
కాగా.. ఇటీవలే పలు జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, సూర్యాపేట జిల్లాలతో సహా 20 జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఆ తరువాత, లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. అయితే ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.