Share News

Satyakumar: ఏపీలో గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం...

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:12 AM

Andhrapradesh: గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. శనివారం యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్‌ను మంత్రి ప్రారంభించారు.

Satyakumar: ఏపీలో గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం...
Minister Satyakumar

విజయవాడ, జూలై 6: గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో (Andhrapradesh) ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) వ్యాఖ్యలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. శనివారం యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..


ప్రజలకు మంత్రి సూచనలు..

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారన్నారు. ప్రధాని మోదీ సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని.. ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుందని అన్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల అతిసారం ప్రబలిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్కడ దృష్టి సారించలేదని తెలిసిందని.. ఇక నుంచి ఇతర శాఖల సమన్వయంతో పని చేస్తామని చెప్పారు. కలుషిత నీరు వల్ల అతిసారంతో ప్రజలు ఆస్పత్రి పాలయ్యారన్నారు.

గత కొన్ని యేళ్లుగా ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, పైపు లైన్లు సరి చేయలేదన్నారు. పైపులు లీకు అయ్యి మంచినీటిలో కలిసిన పరిస్థితి ఉందన్నారు. తమ శాఖ వరకు అన్ని ప్రాంతాలలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వర్షాల సమయంలో కాల్చి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. ప్రాణాల మీదుకు తెచ్చుకోవద్దని కోరుతున్నానన్నారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన తెచ్చుకుని పరిసరాల శుభ్రత పాటించాలని సూచనలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రధాన్యత ఇస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

Dwarampudi Chandrasekhar Reddy: అవినీతి ‘ద్వారం’ బద్ధలు!


అవే నిజమైన దేవాలయాలు..

‘‘ప్రాణం పోసే, ప్రాణం నిలబెట్టే చికిత్స కేంద్రాలు నిజమైన దేవాలయాలుగా నేను భావిస్తా. రూ. 4.65కోట్లతో ఈ ఆరోగ్య మందిరం నిర్మించిన వెలగపూడి ట్రస్ట్ రాజకుమార్‌కు నా అభినందనలు. ఒక మంచి భవనం, వైద్య పరికరాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ కృషిలో భాగస్వామ్యం అయిన సంగా నరసింహారావుకు అభినందనలు. యనమలకుదురు గ్రామంతో నాకు మొదటి నుంచీ అనుబంధం ఉంది. మా గురువు వెంకయ్య నాయుడుతో ఇక్కడకు వచ్చాను. నేను మంత్రి అయ్యాక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రెండు సార్లు ఫోన్‌లు చేశారు. తన పనులు కాకుండా ఆరోగ్య మందిర్ ప్రారంభానికి నన్ను ఆహ్వానించారు. ఈ ఆరోగ్య మందిర్ నిర్మాణం కోసం మా అధికారి కృష్ణబాబు సహకరించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న వారంతా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. గతంలో పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేవారు’’ అని చెప్పుకొచ్చారు.

బాబు వచ్చినా ‘మారలేదు’!


దాతలు ఇచ్చిన స్థలాన్ని దోచేశారు...

విద్య, వైద్యం ప్రతి మనిషి జీవితంలో కీలకమన్నారు. ఆదాయంలో అరవై శాతంపైగా వీటికే ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పుడు ఇటువంటి దాతల స్థలాలు దోచుకునే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులే కబ్జా చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారన్నారు. ప్రజలకు సేవ చేయమని ఎన్నుకుంటే.. దాతలు ఇచ్చిన స్థలాన్ని దోచుకునే పరిస్థితి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఊరుకి ఏమైనా చేద్దామన్నా కూడా ముందుకు రావడం లేదన్నారు. ఇప్పుడు పుట్టిన ఊరి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒక్కటే అన్నీ చేయలేదని.. కొంత వరకే చేస్తుందన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి కి, సేవలకు అందరూ ముందుకు రావాలని కోరారు. ఈ ఆరోగ్య మందిర్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. అవసరమైతే 24 గంటలూ సేవలు కూడా కొనసాగిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Yarapathineni: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వీడియో వైరల్‌.. ఆశ్చర్యపోతున్న వైసీపీ శ్రేణులు

Bole Baba: తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 11:16 AM