Sujanachowdary: ఏపీ చరిత్రలో చాలా శుభదినం
ABN , Publish Date - Jul 23 , 2024 | 03:03 PM
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
అమరావతి , జూలై 23: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి (MLA Sujana Chowdary) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ (NDA Govt) భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. లెఫ్ట్ కెనాల్ పూర్తయితే 25 నుంచి 30 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందన్నారు. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసన్నారు. అసలు అప్పులు ఎంత ఉన్నాయో ఆర్థిక మంత్రికి తెలియడం లేదన్నారు.
డబులింజన్ సర్కార్ ధమాకా ఏమిటో ఈ రోజు తెలిసిందని అన్నారు. ఎప్పుడూ లేనన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో (Budget 2024) కేటాయించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే లక్ష కోట్లు జీఎస్‌డీపీ పెరుగుతుందన్నారు. తద్వారా సంపద పెరిగి ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడ గలుగుతారని చెప్పారు. అక్కడ, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ రావడం డబుల్ ఇంజన్ సర్కార్ స్పీడ్ అర్థం అవుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
Union Budget 2024-25: బడ్జెట్ ప్రభావంతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే!
నిధులు ఇవ్వడం సంతోషకరం: కామినేని శ్రీనివాస్
‘‘ఏపీకి ఎప్పుడు లేనంత నిధులు ఇవ్వడం సంతోషకరం. ఏపీకి సంబంధించి పది అంశాలలో మేలు చేసే నిర్ణయాలు కేంద్ బడ్జెట్‌లో ఉన్నాయి’’ అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్
Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?
Read Latest AP News And Telugu News