Supreme Court: ఇసుక అక్రమాలపై నివేదిక ఇవ్వండి... సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:47 PM
Andhrapradesh: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఆగస్టు 2 కల్లా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలకు సంబంధించి పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) సుప్రీంలో విచారణకు వచ్చింది.
న్యూఢిల్లీ, జూలై 15: ఏపీలో(Andhrapradesh) గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ వాయిదా పడింది. ఆగస్టు 2 కల్లా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలకు సంబంధించి పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ అభయ్ ఒకా ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. తదుపరి విచారణను ఆగస్టు 2కు ఉన్నతన్యాయస్థానం వాయిదా వేసింది.
Vijayasai Reddy: నా పేరు ప్రతిష్టలు దెబ్బ తీస్తే ఆఖరికి మా పార్టీ వారిని కూడా వదలను..
ఏపీలో ప్రభుత్వం మారిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హుజెఫా అహ్మదీ... సుప్రీంకోర్టుకు తెలిపారు. గత అధికారులు ఇసుక తవ్వకాల్లో పెద్దగా ఉల్లంఘనలు జరగలేదని నివేదిక ఇచ్చారన్నారు. అదే సమయంలో మీడియాలో అందుకు విరుద్ధంగా ప్రసారాలు వచ్చాయని.. అందువల్ల రెండిటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సమయం కోరిందని కోర్టుకు తెలిపారు. నివేదికతో పాటు ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో 7 జిల్లాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై తనిఖీలు పూర్తి చేసామని, మరో ఆరు జిల్లాల్లో తనిఖీలు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాది తెలిపారు. మరో ఆరు జిల్లాల్లో సర్వే పూర్తి చేసేందుకు ఆరు వారాల సమయం ఇవ్వాలని కోరారు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ మధ్యంతర నివేదిక ఫైల్ చేసింది. ఏపీలో ఇసుక అక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు పర్యావరణ శాఖ తరపు న్యాయవాది తెలియజేశారు. ఈ క్రమంలో ఏపీలో ఇసుక అక్రమాలపై విచారణను సుప్రీం ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది.
Rohit Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
కాగా... ఏపీలో ఇసుక అక్రమాలపై గతంలో కూడా సుప్రీం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ప్రతి ఇసుక రీచ్‌ను సందర్శించి అక్కడ జరిగిన అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర కమిటీకి సుప్రీం ఆదేశించింది. ఇసుక అక్రమాలను ఖరారు చేసి గతంలో జేపీ వెంచర్స్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించిన సంగతి విధితమే.
ఇవి కూడా చదవండి..
AP News: నల్లమల అడువుల ద్వారా శ్రీశైలం వెళ్తున్నారా?.. ఈ వార్త చదవాల్సిందే!
TS News: సెక్రటేరియట్ ముట్టడి... రాజారాం యాదవ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
Read Latest AP News And Telugu News