Share News

SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:15 PM

Andhrapradesh: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా... ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని లాయర్స్ కోరారు. దీంతో నాలుగు వారాల్లో చెప్పాలని జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఆదేశించారు.

SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై  విచారణ మరోసారి వాయిదా
Skill Case

న్యూఢిల్లీ, ఆగస్టు 5: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrabau Naidu) బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా... ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని లాయర్స్ కోరారు. దీంతో నాలుగు వారాల్లో చెప్పాలని జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఆదేశించారు. రెండు వారాలు వాయిదా వేయాలని.. తర్వాత విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. లూథ్రా విజ్ఞప్తితో తదుపరి విచారణను జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం రెండు వారాలు వాయిదా వేసింది.

TMC: పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన సీఎం మమత


ఇదివరకు ఏం జరిగింది..?

చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. అధికారంలోకి వచ్చాక దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని చంద్రబాబు కొడుకు లోకేష్ బెదిరిస్తున్నారని.. ఆ అంశంపై ఐఏ దాఖలు చేశామని కోర్టుకు న్యాయవాది వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయడం, లేదా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు.

CM Chandrababu: ఈ కాన్ఫరెన్స్ చరిత్రాత్మకమైనది..


అయితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని బాబు తరపు న్యాయవాది సిద్దార్థ లుథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వ తరపు లాయ చెప్పగా.. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ ఎక్కడుందని న్యాయమూర్తి బేలా ఎం త్రివేదీ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి... అందులో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే... అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్‌ బేలా త్రివేది ప్రశ్నించారు.


బెయిల్‌ రద్దు చేయాలని కోరుతున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. స్కిల్‌ కేసులో బెయిల్‌ మంజూరు తర్వాత... చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారన్న ప్రభుత్వ లాయర్ అన్నారు. వెంటనే బెయిల్‌ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, తక్షణం విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వ ఐఏ కనిపించకపోవడంతో విచారణను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఈరోజు మరోసారి విచారణకు రాగా... ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టుకు న్యాయవాదులు తెలపడంతో మరోసారి విచారణ రెండు వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

AP News: అయ్యో పాపం.. కుక్క కాటుతో బాలుడికి మూడు నెలలుగా చికిత్స.. అంతలోనే

Ramakrishna: భూ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 01:16 PM