Rajiv Arrest: జోగీ రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్..
ABN , Publish Date - Aug 13 , 2024 | 12:48 PM
అమరావతి: అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులు ఉన్నారు. వారి వివరాలు..1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.
అమరావతి: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో (Agrigold Land Acquisition Case) మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) కుమారుడు జోగి రాజీవ్‌ను (Jogi Rajiv) ఏసీబీ (ACB) అధికారులు మంగళవారం అరెస్టు (Arrest) చేశారు. ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కొందరు నిందితులు ఉన్నారు. 1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బండారం బహిర్గతమవుతోంది. ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తుండడంతో జోగి కుమారుడు మెడకు ఉచ్చు బిగిస్తోంది.
కాగా విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అక్రమాలపై ఏడాది క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది.
అంబాపురంలో సర్వే నెం. 88లోని 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. వేరేవారి పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్లు రెవెన్యూ నివేదికలో తేటతెల్లమైంది. వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మేశారు. ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ. 7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయినట్లు అధికారులు లెక్క తేల్చారు. కాగా సీఐడీ తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు (మంగళవారం) సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకానున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు.
కాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడలో 'తంగలాన్' మూవీ టీమ్ సందడి..
దువ్వాడపై మంత్రి ఆనం ఘాటు వ్యాఖ్యలు
వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News