AP Politics: ‘ఆపని చేయకండి’.. ఎన్నికల వేళ సీపీ కాంతిరాణా సీరియస్ వార్నింగ్..
ABN , Publish Date - Mar 19 , 2024 | 01:47 PM
AP Elections 2024: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ(Vijayawada) సీపీ కాంతిరాణా(CP Kanthi Rana) రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లుకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు(Election Code) పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కాంతిరాణా..
AP Elections 2024: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ(Vijayawada) సీపీ కాంతిరాణా(CP Kanthi Rana) రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లుకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు(Election Code) పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కాంతిరాణా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 4.19 కోట్లు సీజ్ చేశామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 23 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆధారాలు చూపించాల్సిందే..
ప్రజలు ఎవరైనా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తమ వద్ద ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని సీపీ స్పష్టం చేశారు. లెక్కలు చూపించకుంటే ఆ నగదును సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టామన్నారు. లాడ్జి, హోటల్స్ లో నిరంతరం తనిఖీ లు చేస్తున్నామని, అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులో కి తీసుకుంటామని సీపీ చెప్పారు. యాప్ ద్వారా పొలిటికల్ ర్యాలీ లకు ముందుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు సీపీ. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు. 1850 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి భద్రతపై రివ్యూ చేశామన్నారు. 3000 మందికి పైగా బైండోవర్ చేశామని వెల్లడించారు.
ఆ పని అస్సలు చేయొద్దు..
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు పెట్టొద్దని యూజర్లకు సీపీ క్రాంతిరాణా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధణలకు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు మరికొన్నిచోట్ల అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సీపీ.