Devineni Avinash: దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ యత్నం!.. చివరి నిమిషంలో
ABN , Publish Date - Aug 16 , 2024 | 12:40 PM
Andhrapradesh: విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్‌ను మంగళగిరి పోలీసులు పటాపంచలు చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులకు శంషాబాద్వి మానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు.
హైదరాబాద్/అమరావతి, ఆగస్టు 16: విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ (YSRCP Leader Devineni Avinash) ప్లాన్‌ను మంగళగిరి పోలీసులు (Mangalagiri Poice) పటాపంచలు చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులకు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు తెలిపారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు. మంగళగిరి టీడీపీ (TDP) ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే.. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ విషయం...
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళ గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై జరిగి న దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విష యం విధితమే. నాటి సీఎం జగన్మో హన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో 2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచకమూకలు దాడికి తెగబడ్డాయి. వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి, వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్‌ల ఆధ్వర్యం లో వారి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్దసంఖ్యలో అసాంఘిక శక్తులు, రౌడీషీ టర్లు దాడికి తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు, మంగళగిరి, విజయవాడ ప్రాంతాలకు చెందిన అసాంఘిక శక్తులు తొలుత వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద సమావేశమై అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలపై మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయంపై దాడిచేశారు. ఆ సమ యంలో టీడీపీ కార్యాలయ ప్రధానద్వారం గేట్లు మూసిఉండగా బలవం తంగా వాటిని నేలమట్టం చేసి ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడ్డారు.
తొలుత కార్యాలయ అద్దాలు, ఫర్నిచర్, దొరికిన వస్తువును దొరికినట్లు ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధిం చిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంతేగాక పార్టీ నేతలు అందులో పనిచేేస సిబ్బంది తమ సెల్ ఫోన్లలో ఆయా దృశ్యాలను చిత్రీకరించారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా, పోలీసులు కనీసం చట్ట పరిధిలో వ్యవహరించకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబించారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకు ఎవరు కూడా ఆ కేసు గురించి పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
ఇవి కూడా చదవండి..
Anna Canteen: నెల్లూరులో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ
Gadde Rammohan: జగన్ పేదల నోటి వద్ద కూడా తీసేశారు.. ఎమ్మెల్యే ఫైర్
Read Latest AP News And Telugu News