Raksha Bandhan 2024: రక్షా బంధన్ రోజు మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి చూడండి.. ఎంత మురిసిపోతుందో..
ABN , Publish Date - Aug 16 , 2024 | 12:39 PM
రక్షా బంధన్(Raksha Bandhan) చాలా ప్రత్యేకమైన పండుగ. ఇది సోదర, సోదరీమణుల మధ్య బలమైన బంధాన్ని గుర్తు చేసుకునే ప్రియమైన వేడుక. అయితే ఈ రోజున బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. అయితే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షా బంధన్(Raksha Bandhan) పండుగ సోదర, సోదరీమణుల మధ్య బలమైన బంధాన్ని గుర్తు చేసుకునే ప్రియమైన భారతీయ పండుగ. ఈ పండుగను దేశవ్యాప్తంగా కుల మాతాలకు అతీతంగా జరుపుకుంటారు. పవిత్రమైన రాఖీ కట్టడంతో జరుపుకునే ఈ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, రక్షణ, ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తుంది. ఆ క్రమంలో సోదరీమణులు సోదరుడికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటారు.
ఈ ప్రత్యేకమైన రోజున బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతుంది. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రతి బహుమతి వారి జీవితంలో శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావడంలో తోడ్పడుతుంది. అయితే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది(2024) రక్షా బంధన్ వేడుకను సోమవారం ఆగస్టు 19న జరుపుకుంటారు.
ఆభరణాలు
మీ సోదరి పేరు లేదా ప్రత్యేక తేదీతో తయారు చేయించిన బ్రాస్‌లెట్ లేదా నెక్లెస్ వంటవి బహుమతిగా ఇవ్వండి. ఆ తేదీకి ఉన్న ప్రాముఖ్యత కలిగిన సందేశం లేదా చిహ్నాలను దానిలో జోడించడం ద్వారా ఆ బహుమతి ఎల్లప్పుడు గుర్తుండిపోయేలా ఉంటుంది.
ఫోటో ఫ్రేమ్‌లు
మీ సోదరీమణులకు ఇష్టమైన జ్ఞాపకాలను అందంగా రూపొందించిన ఫోటో ఫ్రేమ్‌లో క్యాప్చర్ చేయండి. దానికి ఒక మంచి మెసేజ్ యాడ్ చేసి ఆ క్షణాలను గుర్తు చేసుకునే విధంగా అందించవచ్చు.
విగ్రహాలు
దేవతలు, దేవతల విగ్రహాలు లేదా పూజకు సంబంధించిన వస్తువులు (యంత్రాలు, మంత్రాలు మొదలైనవి) వంటి మతపరమైన వస్తువులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ బహుమతి మత విశ్వాసం, భక్తికి చిహ్నంగా ఉంటుంది. దీంతోపాటు ఆధ్యాత్మిక స్థాయిలో సోదర సోదరీమణుల సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలతను ప్రేరేపిస్తుంది.
దుస్తులు లేదా ఇతరాలు
మంచి బట్టలు లేదా గడియారాలు ఇతర వ్యక్తిగత వస్తువులను కూడా బహుమతులుగా ఇవ్వవచ్చు. వీటి ద్వారా మీరు మీ సోదరీమణుల సంతృప్తిని పెంచుతారు. ఆ క్రమంలో మీ వ్యక్తిగత సంబంధం మరింత బలపడుతుంది.
పుస్తకాలు, విద్యా సామగ్రి
మీ సోదరి చదువుకునే వయస్సులో ఉంటే వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పుస్తకాలు లేదా విద్యా సామగ్రిని కూడా మంచి బహుమతిగా అందించవచ్చు. ఆ బహుమతి వారి భవిష్యత్తు చదువు, వృత్తిలో చేరుకునేందుకు సహాయం చేస్తుంది. ఆ క్రమంలో మీరు అందించిన బహుమతి కలకాలం గుర్తుండిపోతుంది.
అయితే ప్రస్తుతం దూరంగా ఉన్న తోబుట్టువులు బహుమతులను ఆన్‌లైన్ విధానంలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పోస్టల్ సౌకర్యంతోపాటు ఇతర ఆన్‌లైన్ వేదికలు కూడా అందుకోసం అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News