Share News

Chandrababu:వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది

ABN , Publish Date - Aug 01 , 2024 | 02:32 PM

శ్రీశైలాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు.

Chandrababu:వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది
CM Nara Chandrababu Naidu

నంద్యాల: శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. ఏపీకి మంచి రోజులొచ్చాయని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలు మంచిగా ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కోరుకున్నానని చెప్పారు. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం, జల హారతి ఇవ్వడం సంతోషమని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడం ఎన్టీఆర్ కల అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.


ALSO Read: Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

జగన్ పాలనలో భయంతో బతికారు..

‘‘రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తెలుగు గంగ నుంచి చెన్నైకి నీళ్లు తీసుకెళ్లాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాను. కానీ మాజీ సీఎం జగన్ కేవలం రూ. 2వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. జగన్ పాలనలో జనం భయంతో బతికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనం స్వేచ్ఛగా ఉన్నారు. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాను. కానీ ఖజానా ఖాళీ అయింది. మరో రెండు, మూడు రోజుల్లో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయి. వరద నీరు సముద్రంలో కలవకుండా ప్రాజెక్టులకు తరలించేలా ప్రణాళికలు రూపొందించి రాయలసీమను రత్నాల సీమ చేస్తా.. ఇది సాధ్యం. వైసీపీ పాలనలో రాయలసీమ రాళ్ల సీమగా మారింది. నీరు ఉంటే సంపద సృష్టిస్తాం. సంపద ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల పేదరికం పోతుంది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ALSO Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

యువతకు స్కిల్స్ నేర్పిస్తాం

‘‘శ్రీశైలం మండలం యువత అమెరికాలో ఉద్యోగం పొందేలా స్కిల్స్ నేర్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సమర్థించింది. సామాజిక న్యాయం టీడీపీ సిద్ధాంతం. 2024 ఎన్నికల్లో టికెట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించాం. ఈ ప్రభుత్వం అందరిది. అందరికీ న్యాయం జరగాలి. జీరో పావర్టీ కింద ఉన్నపేదలను పైకి తీసుకు రావడమే నా లక్ష్యం. రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. దోచుకోవడం, దాచు కోవడం, విధ్వంసం చేయడం వైసీపీ నైజం. రెండు నెలల్లో ఏమి చేశారని వైసీపీ అంటోంది. నేనేమి చేశానో ప్రజలకు తెలుసు. సిద్దేశ్వరం దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నీటి సమస్య పరిష్కరిస్తా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vundavalli Sridevi: కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసిన వ్యక్తి జగన్..

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం

Mandakrishna: ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో చెప్పా...

MLA Kanna: అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 02:58 PM